చంద్రబాబు హయాంలో రాజధాని విషయంలో జరిగిన తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సిదిరి అప్పలరాజు అన్నారు. ఆయన ఆదివారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం చంద్రబాబు టీడీపీ విషయంలో గందరగోళంలో ఉన్నారన్నారు. దీంతో బాబు మిగతా పార్టీనేతలను రెచ్చగొతున్నారని అప్పలరాజు మండిపడ్డారు. రాష్ట్రంలో అశాంతి నెలకొల్పి చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని అప్పలరాజు ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయ ఉగ్రవాదిగా మరిపోయరని ఆయన విరుచుకపడ్డారు.
చంద్రబాబు రాజకీయ ఉగ్రవాది..
Jan 19 2020 5:29 PM | Updated on Jan 19 2020 6:28 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement