పుట్టా సుధాకర్‌కు చేదు అనుభవం | putta sudhakar yadav faces bitter experience at chapadu | Sakshi
Sakshi News home page

పుట్టా సుధాకర్‌కు చేదు అనుభవం

Mar 18 2019 11:01 AM | Updated on Mar 22 2024 11:31 AM

టీటీపీ ఛైర్మన్‌, వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు స్థానం నుంచి టీడీపీ తరఫున బరిలో నిలబడ్డ పుట్టా సుధాక‌ర్‌కు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. చాపాడు మండలంలోని సీతారామపురం గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆయనకు సొంత పార్టీ కార్యకర్తలే దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. ఏం చేశావని ఓటు అడగటానికి వచ్చావంటూ పుట్టా సుధాకర్‌ను పచ్చి బూతులు తిడుతూ నిలదీశారు. ఏ ఒక్క సాయం చేకుండా అయిదేళ్లు దోచుకుని, ఇప్పుడు ఓట్లు కోసం వస్తారా అంటూ రాయడానికి వీలులేని భాషలో నోటికి పని చేశారు. తక్షణమే అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ వాగ్వివాదానికి దిగారు. దీంతో బిక్కచచ్చిపోయిన పుట్టా సుధాకర్‌....చేసేదేమీ లేకా అక్కడ నుంచి మౌనంగా వెనుదిరిగారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement