కన్నెపల్లి పంప్‌హౌస్ నిర్మాణ పనులతో పాటు గ్రావిటీ కెనాల్ పనులను వేగవంతం చేయాలని.. డెడ్‌లైన్ మార్చి 31లోపు పూర్తి కావాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని ఏప్రిల్ 15 లోపు పూర్తి చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా మంగళవారం ఆయన మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు. వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టు రైతులకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని.. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి కావాల్సిందేనని ఆదేశించారు.