రాష్ట్ర చరిత్రపుటల్లో నేటి నుంచి నవ శకం ప్రారంభం కానుంది. కాళేశ్వరంలోని ముక్తీశ్వరుడి సాక్షిగా గోదావరి జలాలతో రాష్ట్రానికి అభిషేకం చేసే మహాక్రతువు మొదలవ్వనుంది. దేశ సాగునీటి రంగ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో అనతి కాలంలోనే పూర్తయిన బృహత్తర బహుళార్ధక సాధక కాళేశ్వర ఎత్తిపోతల పథకం నేటి నుంచి జాతికి అంకితం కానుంది. భగీరథుడు గంగను దివి నుంచి భువికి దించితే... నేటి భగీరథ యత్నం తెలుగు గంగను నేల నుంచి నింగికి ఎత్తే సరికొత్త చరిత్రను సృష్టించనుంది.