పెన్నా సిమెంట్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

జిల్లాలోని పెన్నా సిమెంట్‌ ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. బాయిలర్లు పేలి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. యాడికి మండలం బోయరెడ్డిపల్లిలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అయిదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top