సిద్దిపేట రైతు బజార్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో జనం భయాందోళనలకు గురై పరుగులు తీశారు. స్థానికుల సమాచారం ప్రకారం మొదటగా రైతు బజారు ఎదురుగా ఉన్న దుకాణంలో మంటలు సంభవించాయని, అనంతరం మరికొన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయని తెలిపారు.