మెగాస్టార్ చిరంజీవి, శోభన్ బాబులతో వరుస సినిమాలు తెరకెక్కించిన ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు(86) ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. 1936 సెప్టెంబర్ 22న ఏలూరు సమీపంలోని చాటపర్రులో జన్మించిన విజయ బాపినీడు, ఎంతో మంది ప్రముఖులను రాష్ట్రానికి అందించిన సీఆర్‌ఆర్ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. తరువాత జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి సినిమా రంగం మీద మక్కువతో రచయితగా దర్శకుడిగా మారారు. నిర్మాతగానూ విజయం సాధించారు.