దేశ రాజధాని ఢీల్లీతోపాటు ప్రపంచంలోని పలు నగరాలు నేడు అధిక వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కొత్త డీజిల్ కార్ల కొనుగోలుపై నిషేధం విధించడంతోపాటు ప్రస్తుత కార్లను రోడ్లపైకి ‘సరి బేసి’ విధానంతో అనుమతిస్తున్నారు. అంటే నెంబర్ ప్లేట్‌పై సరి సంఖ్య కలిగిన కార్లను ఒక రోజు అనుమతిస్తే బేస్ సంఖ్య కలిగిన కార్లను ఆ మరుసటి రోజు అనుమతిస్తున్నారు. లండన్‌లో ‘కంజెషన్ చార్జింగ్ (రద్దీ నివారణకు చార్జీలు)’ అమలు చేస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు వరకు తిరిగే అన్ని వాహనాలపై నిర్దేశిత చార్జీలు వసూలు చేస్తారు. శని, ఆదివారాల్లో, ఇతర సెలవు దినాల్లో వసూలు చేయరు. పారిస్‌లో ‘బైక్ షేరింగ్’ విధానాన్ని అమలు చేస్తుండగా, చైనాలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేశారు.
‘మాస్క్’లు కాలుష్యాన్ని ఆపుతాయా!?
Nov 8 2019 3:55 PM | Updated on Nov 8 2019 4:38 PM
Advertisement
Advertisement
Advertisement
