లడ్డూ..లిక్కరూ ఒక్కటేనన్న బాబు
తిరుమల లడ్డుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన వెంకన్న లడ్డును మద్యంతో పోల్చారు. మద్యం ధరలు పెంచినట్లే తిరుమల లడ్డు పెంచుతున్నారంటూ.. ఏడుకొండల వాని ప్రసాదాన్ని దారుణంగా అవమానించారు. అమ్మకాలు తగ్గించడానికే మద్యం ధరలు పెంచుతున్నామని ప్రభుత్వం పేర్కొంది. కాగా, చంద్రబాబు వ్యాఖ్యల పట్ల వెంకన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన తిరుమల లడ్డును మద్యంతో పోల్చడమేంటని మండిపడుతున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి