సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. తక్షణమే ప్రధానమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాలయ్య ఇంటి ముందు బైఠాయించి ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.