బీజేపీ నిర్ణయం..షాక్ తిన్న చంద్రబాబు | BJP And CPM Parties Not Attending Chandrababu Naidu Meeting | Sakshi
Sakshi News home page

బీజేపీ నిర్ణయం..షాక్ తిన్న చంద్రబాబు

Dec 5 2019 11:46 AM | Updated on Dec 5 2019 11:57 AM

గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును నమ్మి మోసపోయామని, మరోసారి అందుకు సిద్ధంగా లేమని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు విజయవాడలో గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీజేపీ, సీపీఎంతో పాటు మిగిలిన అన్ని పార్టీలు రావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. అయితే బీజేపీ, సీపీఎం నేతలు ఈ సమావేశానికి హజరుకాకుండా చంద్రబాబుకు ఝలక్‌ ఇచ్చారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. బీజేపీతో కలవడం కోసమే చంద్రబాబు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని అభిప్రాయపడ్డారు. టీడీపీకి తోక పార్టీగా ఉండటం తమకు ఇష్టం లేదని, సొంతంగానే ఉద్యమాలు చేస్తామని పేర్కొంటున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement