తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సౌతాఫిక్రాలో ఓ అభిమాని జననేతపై తనకున్న అభిమానాన్ని విభిన్నంగా చాటుకున్నారు. గురజాల మాజీ శాసన సభ్యుడు కొత్త వెంకటేశ్వర్లు మనమడు కొత్త రామకృష్ణ సౌతాఫ్రికాలో ఉంటున్నారు. వైఎస్ జగన్‌పై ఎప్పుడు తన అభిమానాన్ని చాటుకునే రామకృష్ణ ఈ సారి జననేతకు తనదైన శైలిలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపాలని భావించారు. అందుకోసం స్కై డైవ్ చేద్దామని నిర్ణయించుకున్నారు. వైఎస్ జగన్ ఫొటోతో 11 వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవ్ చేసి.. జననేతకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
ఆకాశంలో అభిమానం..
Dec 21 2018 1:44 PM | Updated on Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement