ఎన్డీయేతో టీడీపీ తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలను బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌కు అప్పగిస్తూ.. నిర్ణయించింది. ఏపీ టీడీపీ నేతలు శనివారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. అమిత్ షాతో జరిగిన ఈ భేటీలో ఏపీ నేతలు రాం మాధవ్, పురందేశ్వరీ, హరిబాబు, కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాల రావు, సతీష్ జీ, విష్ణుకుమార్ రాజు, సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.