- పవిత్ర క్షేత్రాన్ని సొంత కార్యాలయంగా మార్చిన టీవీ5 అధినేత బీఆర్ నాయుడు
- తిరుమలలో టీవీ5 రిపోర్టర్ ఆకతాయి చేష్టలు
టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి శ్రీవారి ఆలయంలో అనేక అపచారాలు జరుగుతూ వస్తున్నాయి. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన మొదలుకొని నేడు టీవీ5 తిరుమల రిపోర్టర్ శ్యామ్‌నాయుడు ఆకతాయి చేష్టల వరకు అనేక తప్పిదాలు బీఆర్ నాయుడు హయంలోనే జరుగుతుండటం గమనార్హం. తిరుమల శ్రీవారి ఆలయం మహద్వారం గ్రిల్ గేట్ వద్ద టీవీ5 ఉద్యోగి శ్యామ్‌నాయుడు చిల్లర వేషాలు వేశారు.
అంతా విష్ణుమాయ అంటూ.. చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయానికి తాళాలు వేస్తున్న ఫోటో, వీడియో స్వతహాగా ఆయనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మహా ద్వారం వద్ద ఉన్న గ్రిల్ గేటుకు తాళం వేస్తూం తీస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
ఇదేనా టీటీడీ చైర్మన్ చేసే ప్రక్షాళనం
Sep 10 2025 10:59 PM | Updated on Sep 10 2025 10:59 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement