గర్భవతిపై పాశవిక దాడి | Man Punches Stomps On Heavily On Pregnant Woman At Sydney | Sakshi
Sakshi News home page

గర్భవతిపై పాశవిక దాడి

Nov 22 2019 3:37 PM | Updated on Nov 22 2019 3:42 PM

గర్భవతి అని కూడా చూడకుండా ఓ వ్యక్తి మహిళ పట్ల కౄరంగా ప్రవర్తించాడు. ఇష్టారీతిన ఆమెను కొట్టి.. కిందపడేసి తన్నాడు.  సీసీ కెమెరాలో రికార్డైన ఈ దశ్యాలు ప్రతి ఒక్కరి మనసును కలిచి వేస్తున్నాయి. ఈ దారుణ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. నగరంలోని ఓ కేఫ్‌లో ముగ్గురు మహిళలు ముఖానికి స్కార్ప్‌ ధరించి కూర్చుని ఉండగా.. గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి ఒక్కసారిగా మహిళపై దాడికి తెగబడ్డాడు. 38 వారాల గర్భవతిగా ఉన్న ఆమెపై ఆవేశంతో చేతితో పిడిగుద్దులు కురిపించి, ఆపై కాలితో తన్ని కింద పడేశాడు. ఘటనాస్థలిలో ఉన్న వారు దుండగుడిని ఆపినప్పటికీ.. అతడు రెచ్చిపోయాడు. ఈ దాడిలో సదరు మహిళ కళ్లు తిరిగి పడిపోయింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం తన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement