మహాత్ముని 150వ జయంత్యుత్సవాలను అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. దానిలో భాగంగా బాలీవుడ్ ప్రముఖ నటులు, నిర్మాతలతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భేటీ అయ్యారు. ‘గాంధీ ఎట్ 150’ ఇతివృత్తంగా తీసిన వీడియోలను లోక కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో మోదీ విడుదల చేశారు. గాంధీజీ బోధనల ఆధారంగా #ChangeWithin పేరుతో రాజ్‌కుమార్ హిరాణీ రూపొందించిన 100 సెకండ్ల వీడియోలో ఆమిర్‌ఖాన్, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్, సోనమ్‌కపూర్ అహుజా, కంగనా రనౌత్, విక్కీ కౌశల్ భాగమయ్యారు.