ప్రత్యేక హోదాపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్సీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాకుండా సైంధవుడిలా అడ్డుపడుతున్న చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని విమర్శించారు. తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ వరప్రసాద్ పాల్గొన్నారు.