ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాకు పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం లేదు. కేబినెట్ ఆమోదంతో ప్రత్యేక హోదా ఇవ్వొచ్చు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్కు కేబినెట్ ఆమోదంతోనే ప్రత్యేక హోదా ఇచ్చారు. ప్రత్యేక హోదా లేకపోతే ప్యాకేజీ రానేరాదు.