ప్రధాని నరేంద్రమోదీ రోహింగ్యా శరణార్ధులను ఎందుకు తన సోదరులుగా అంగీకరించడం లేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. దేశ భద్రతకు రోహింగ్యా శరణార్ధులతో ముప్పు వాటిల్లుతుందని వెనక్కి పంపించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఎందరో శరణార్థులకు ఆశ్రయం కల్పించి, ముస్లింలైన రోహింగ్యాలను ఎందుకు అనుమంతించడం లేదన్నారు