మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఆయన ఈరోజు ఉదయం 5 గంటల 15 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా పురుషోత్తం రెడ్డి బ్రెయిన్‌స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. మే 1న ఆయనను చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఉప్పునూతల కోమాలోనే ఉన్నారు. ఉప్పునూతల స్వగ్రామం నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం అడ్డగూడూరు. కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాలంలో పురుషోత్తం రెడ్డి మంత్రిగా పనిచేశారు. రామన్నపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, తెలంగాణ అభివృద్ధి మండలి ఛైర్మన్‌గా, ఎపిఐఐసీకి చైర్మన్‌గా ఉప్పునూతల పనిచేశారు. ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి మృతి పట్ల పలువురు దిగ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్ నేతను కోల్పోయామని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి అన్నారు.
Aug 3 2013 9:04 AM | Updated on Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement