టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన కుటుంబ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజలపై రూ.80వేల కోట్ల భారం మోపారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి బంధువుల భూములు కాపాడేందుకే తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టారన్నారు. ప్రాజెక్టుల ఎత్తు తగ్గించుకొని వచ్చిన కేసీఆర్...ఏం సాధించారని సంబరాలు చేసుకున్నారో చెప్పాలన్నారు. జలయజ్ఞంలో కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని, ఆధారాలు లేకుండా మాట్లాడిన కేసీఆర్ను జైల్లో పెట్టాలని భట్టి అన్నారు.