టీడీపీది రోజుకో బాగోతం! | telangana-minister-ktr-meets-nitin-gadkari | Sakshi
Sakshi News home page

Jun 19 2015 7:40 AM | Updated on Mar 22 2024 10:59 AM

ఓటుకు కోట్లు కేసులో టీడీపీది రోజుకో మాట, రోజుకో బాగోతం అని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. ఈ కేసులో అడ్డంగా దొరికిపోవడమేకాక ఇతరులపై ఆ పార్టీ నేతలు బురదజల్లుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని టీడీపీ చేస్తున్న ఆరోపణలు, కేసీఆర్‌పై ఏపీలో కేసులు పెట్టడంపై గురువారం ఇక్కడ విలేకరులు కేటీఆర్ స్పందన కోరగా ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. వాస్తవంగా జరిగిందేమిటో ప్రజలు చూశారన్నారు. ఓటుకు కోట్లు కేసు గురించి అడగ్గా.. చట్టం తన పనితాను చేస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement