పాకిస్థాన్ మళ్లీ బరి తెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలోని షాపూర్ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. సరిహద్దు వెంట ఉన్న గ్రామాలపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించింది. అయితే కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలుస్తోంది