ఓటుకు నోటు కేసులో నోటీసులు అందుకున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం ఏసీబీకి లేఖ రాశారు. వెన్నునొప్పి కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. వైద్యులు పది రోజులు విశ్రాంతి తీసుకోవాలన్నారని, కోలుకున్నాక విచారణకు హాజరు అవుతానని సండ్ర తెలిపారు.