సచివాలయంలో సమ్మె చేసే హక్కు సీమాంధ్ర ఉద్యోగులకు లేదని సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ కన్వీనర్ నరేందర్‌రావు అన్నారు. సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగులు సచివాలయంలోకి వచ్చి ఎలా సమ్మె చేస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్ మీద పెత్తనం కోసమే సీమాంధ్రులు తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను తమదైన తీరులో ప్రతిఘటిస్తామని ఆయన పేర్కొన్నారు.