పోటీ పరీక్షల్లో నెగిటివ్ మార్కుల కోత | Negative marks in competitive examinations | Sakshi
Sakshi News home page

Dec 7 2016 7:38 AM | Updated on Mar 21 2024 6:42 PM

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో వివిధ పోస్టుల భర్తీకి ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో ‘నెగటివ్ మార్కుల’ విధానాన్ని అనుసరించాలని నిర్ణరుుంచింది. ఒక తప్పుడు సమాధానానికి 1/3 మార్కును కోత విధించనున్నారు. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకటప్ప జీఓ నంబర్ 235ని విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఆబ్జెక్టివ్ తరహా పరీక్షల్లో అభ్యర్ధులు కొందరు తమకు సరైన సమాధానాలు తెలియకపోరుునా బహుళ సమాధానాల్లో ఏదో ఒకదాన్ని లాటరీ పద్ధతిలో గుర్తిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement