ఖమ్మంలో మిర్చి రైతుల ఆగ్రహం | Mirchi farmers attack on market yard In khammam | Sakshi
Sakshi News home page

Oct 28 2013 12:33 PM | Updated on Mar 21 2024 6:35 PM

ఖమ్మంలో మిర్చి రైతులు మరోసారి భగ్గుమన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర రాకపోవటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ రేటుకే మిర్చి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ధ గతరాత్రి ఏడు గంటల సమయంలో మార్కెటుకు వచ్చిన పచ్చిమిర్చిని క్వింటాకు రూ.1390 చొప్పున వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. అయితే ఆ తరువాత మిర్చి భారీగా రావటంతో వ్యాపారులు సిండికేట్ అయి క్వింటాకు రూ.800 నుంచి రూ.1000 మాత్రమే చెల్లిస్తామని చెప్పటంతో అన్యాయమని రైతులు నిలదీశారు. ధర విషయమై వారు వ్యాపారులతో వాగ్వివాదానికి దిగారు. దుకాణాల ముందున్న ట్రేలను ధ్వంసం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి చర్చలు జరిపినా వివాదం సమసిపోలేదు. దాంతో రైతులు రాత్రంతా బైపాస్ రోడ్డుపై ధర్నా చేపట్టారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement