జీవో నెంబర్ 123, 124 రద్దుపై అప్పీల్కు వెళతామని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీని పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆయన బుధవారమిక్కడ అన్నారు. రైతులకు మెరుగైన పరిహారం ఇచ్చేందుకే జీవో 123ని తీసుకు వచ్చామన్నారు. జీవో 123పై ఖచ్చితంగా న్యాయం పొందుతామని హరీశ్ రావు దీమా వ్యక్తం చేశారు. జీవో 123 ద్వారా పేద ప్రజలకు, నిర్వాసితులకు మరింత మెరుగైన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం భావించిందన్నారు. 2013 భూసేకరణ చట్టంలో ఉన్న వెసులుబాటు ఆధారంగానే 123 జీవోను జారీ చేశామన్నారు.