రాజధాని నగరాన్ని బుధవారం భారీ వర్షం ముంచెత్తింది. పలు ప్రాంతాలు నీటమునిగాయి. సాయంత్రం నాలుగు గంటల సమయంలో కుండపోతగా మొదలైన వాన దాదాపు రాత్రి తొమ్మిది గంటల వరకూ 5 గంటల పాటు ఏకధాటిగా కురిసింది. రహదారులపైకి వర్షపు నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. నగరంలోని నదీం కాలనీతో సహా పలు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. బుధవారం నగరంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షం కురిసింది. అత్యధికంగా సంగారెడ్డిలో 12 సెం.మీ. వర్షపాతం నమోదైంది. లగ్జెట్టిపేటలో 9, శ్రీకాళహస్తిలో 8, నారాయణ్‌ఖేడ్, సిర్పూర్‌లలో 6, వివిధ ప్రాంతాల్లోని మరికొన్ని చోట్ల 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి 30 మండలాల పరిధిలో సగటున 12.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు రాష్ట్రంపై రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. వీటి వల్ల వచ్చే 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత బలోపేతమయ్యాయి. ఒడిశా నుంచి కోస్తాంధ్రతోపాటు అనుకుని ఉన్న ప్రాంతాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు, గుంటూరు, కడప, తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం అంటే?: భూమి నుంచి పైకి వెళ్తున్న కొలదీ గాలిలో మార్పులొస్తుంటాయి. వీటిని బట్టి ఒత్తిడి/పీడనాలు ఏర్పడుతుంటాయి. 3 నుంచి 9 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలిలో మార్పులకు అనుగుణంగా ఉపరితల ఆవర్తనాల్ని పరిగణిస్తుం టారు. ఎంత ఎత్తుకు పీడనం కలుగుతుంటే అంత ఎత్తుకు మేఘాలు వెళ్తుంటాయి. వీటి ఆధారంగా వర్షం వస్తుంది. అది ఒక్కోసారి తుపానుగా మారుతుంది. అల్పపీడనం అంటే?: ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఒకే సమయాన్ని కొలమానంగా తీసుకొని వాతావరణంలో పీడన విలువలను లెక్కిస్తుంటారు. తీర ప్రాంతాల్లో పీడనాలు తక్కువ ఉంటే, వాటిని లెక్కించి అల్పపీడనం ఏర్పడిందని ప్రకటిస్తారు. ఈ సమయంలో సాధారణం కంటే అధికంగా వర్షం పడే అవకాశాలుంటాయి. రాజధాని నగరాన్ని బుధవారం భారీ వర్షం ముంచెత్తింది. పలు ప్రాంతాలు నీటమునిగాయి. సాయంత్రం నాలుగు గంటల సమయంలో కుండపోతగా మొదలైన వాన దాదాపు రాత్రి తొమ్మిది గంటల వరకూ 5 గంటల పాటు ఏకధాటిగా కురిసింది. రహదారులపైకి వర్షపు నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. నగరంలోని నదీం కాలనీతో సహా పలు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. బుధవారం నగరంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షం కురిసింది. అత్యధికంగా సంగారెడ్డిలో 12 సెం.మీ. వర్షపాతం నమోదైంది. లగ్జెట్టిపేటలో 9, శ్రీకాళహస్తిలో 8, నారాయణ్‌ఖేడ్, సిర్పూర్‌లలో 6, వివిధ ప్రాంతాల్లోని మరికొన్ని చోట్ల 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి 30 మండలాల పరిధిలో సగటున 12.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు రాష్ట్రంపై రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. వీటి వల్ల వచ్చే 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత బలోపేతమయ్యాయి. ఒడిశా నుంచి కోస్తాంధ్రతోపాటు అనుకుని ఉన్న ప్రాంతాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు, గుంటూరు, కడప, తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం అంటే?: భూమి నుంచి పైకి వెళ్తున్న కొలదీ గాలిలో మార్పులొస్తుంటాయి. వీటిని బట్టి ఒత్తిడి/పీడనాలు ఏర్పడుతుంటాయి. 3 నుంచి 9 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలిలో మార్పులకు అనుగుణంగా ఉపరితల ఆవర్తనాల్ని పరిగణిస్తుం టారు. ఎంత ఎత్తుకు పీడనం కలుగుతుంటే అంత ఎత్తుకు మేఘాలు వెళ్తుంటాయి. వీటి ఆధారంగా వర్షం వస్తుంది. అది ఒక్కోసారి తుపానుగా మారుతుంది. అల్పపీడనం అంటే?: ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఒకే సమయాన్ని కొలమానంగా తీసుకొని వాతావరణంలో పీడన విలువలను లెక్కిస్తుంటారు. తీర ప్రాంతాల్లో పీడనాలు తక్కువ ఉంటే, వాటిని లెక్కించి అల్పపీడనం ఏర్పడిందని ప్రకటిస్తారు. ఈ సమయంలో సాధారణం కంటే అధికంగా వర్షం పడే అవకాశాలుంటాయి.