విశాఖపట్టణం అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులో పెద్ద ఎత్తు మంటలు ఎగసి పై అంతస్తులకు వ్యాపిస్తున్నాయి. అగ్నికీలలు ఎగసి పడుతుండటంతో భవనం మొత్తం దట్టమైన పొగలతో నిండిపోయింది. అయితే ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.