సీమాంధ్రకు చిల్లే! | financial crisis to be in seemandhra by state division | Sakshi
Sakshi News home page

Feb 9 2014 10:40 AM | Updated on Mar 21 2024 6:15 PM

రాష్ట్ర విభజన అనివార్య మైతే... కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్ (సీవూంధ్ర) రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక ఇక్కట్లు చుట్టువుుట్టనున్నారుు! చివరకు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులు, రోజువారీ ప్రభుత్వ ఖర్చులకూ కటకటలాడాల్సిన దుస్థితి ఏర్పడనుంది. ఈ సవుస్యలన్నీ ప్రస్తావిస్తూ, సీవూంధ్ర భవిష్యత్తు కష్టాలు తీర్చటానికి ఉద్దేశించి సీవూంధ్ర ప్రతినిధులు.. విభజన బిల్లుకు పలు సవరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించినా కేంద్ర కేబినెట్ బేఖాతరు చేసింది. తన పాత వైఖరికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర విభజన అనంతరం సీవూంధ్ర తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రవూదం కనిపిస్తోంది. ప్రత్యేకించి సీవూంధ్ర ఆదాయుం పెరిగేందుకు వీలుగా ప్రత్యేక సాయూన్ని అందించాలనే కోరికలనూ, కొద్ది సంవత్సరాల పాటు పరిశ్రమలకు ట్యాక్స్ హాలిడే (పన్నులకు విరామం) ప్రకటించాలనే విజ్ఞప్తులనూ, అభివృద్ధి కేంద్రీకృతమైన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఆదాయుంలో వాటా ఇవ్వాలనే విన్నపాలనూ, చివరకు కొత్త రాజధాని నిర్మాణానికి నిర్దుష్టమైన ప్యాకేజీని వుుందే ప్రకటించాలనే డివూండ్‌నూ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది! ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే సొంత ఆదాయుమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆదాయుం నుంచి వాటా, గ్రాంట్లు సవుకూరుతుంటారుు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement