మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారికి కళ్లెం వేసేందుకు పోలీసులు తనిఖీలు చేపడుతూనే ఉన్నారు. అయినా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. జూబ్లీహిల్స్ పోలీసులు వెంటగిరి ప్రాంతంలో శుక్రవారం రాత్రి చేపట్టిన తనిఖీల్లో 16 మంది మందు బాబులు దొరికారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నందుకు పోలీసులు కేసులు నమోదు చేశారు. వారికి చెందిన 9 కార్లు, ఏడు బైక్‌లను పోలీసలు సీజ్ చేశారు.