వరుస కరువుల తర్వాత ఆశలు రేకెత్తించిన ఖరీఫ్.. రైతులకు మళ్లీ కష్టాలు, కన్నీళ్లే మిగిల్చింది. జూలై 31తో ఖరీఫ్ సాగు సీజన్ దాదాపు ముగిసినట్లే. (ఇక మిగిలింది లేట్ ఖరీఫే) వేరుశనగ సాగుకు పూర్తిగా అదును దాటిపోయింది. వరుణుడు ముఖం చాటేయడంతో భూములు బీళ్లుగానే మిగిలిపోయాయి. వర్షాభావంతో సాగు ఘోరంగా పడిపోయింది. అరకొరగా సాగైన పంటలు చినుకు జాడ లేక ఎండిపోతున్నాయి. కరువుసీమ రాయలసీమలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అనంతపురం జిల్లాలో ఎండుతున్న పంటలను కాపాడుకునే మార్గం కనిపించక రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతం.