ఇటీవల మరణించిన తిరుపతి ఎమ్మెల్యే ఎం. వెంకటరమణ సహనానికి మారు పేరని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో వెంకటరమణ మృతిపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం వెంకటరమణ సేవలను చంద్రబాబు కొనియాడారు. తొలుత తిరుపతి పట్టణ కౌన్సిలర్గా ఎన్నికైన ఆయన అనంతరం ఎన్నో ఉన్నత పదవులు అలంకరించారని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు వెంకటరమణ నిత్యం ముందు ఉండేవారని అన్నారు.
Dec 18 2014 9:37 AM | Updated on Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement