పొగాకు పండించే రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకుంటే చంద్రబాబు ప్రభుత్వంపై సమరశంఖం పూరిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ఇందుకు ఈ నెల 10 తుది గడువు అని కూడా ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలో పొగాకు సాగుచేసే జిల్లాల్లో రైతుల పక్షాన ప్రత్యక్ష ఆందోళనలో భాగంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఆయన శనివారం పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మూడురోడ్ల జంక్షన్ నుంచి పొగాకు వేలం కేంద్రానికి ఎడ్ల బండిపై వెళ్లారు. పొగాకు సాగులో ఎదురవుతున్న నష్టాన్ని తగ్గించడంలో సర్కార్ వైఫల్యంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రసంగం ఇలా.. కేజీకి రూ.150 ఇవ్వాల్సిందే: గత ఎన్నికల ముందు ఇదే పొగాకుబోర్డు వద్ద మీటింగు పెట్టి రైతుల వద్దకు వచ్చిన చంద్రబాబుై రెతుల రుణాలు అన్నీ మాఫీ చేసేస్తానని చెప్పారు. మీలో ఎంత మంది రుణాలు మాఫీ అయ్యా యో చెప్పండి.. ఇదీ రైతులకు చంద్రబాబు చే సిన ద్రోహం.బాబు సీఎం అయ్యేనాటికి కేజీ రూ.172లు పలుకుతోంది. ఇవాళ పొగాకు ధర యావరేజ్‌గా రూ.117 అని చెబుతున్నారు. రైతుల దగ్గరకు వెళ్లి అడిగితే రూ.110లు కూడా దక్కడంలేదంటున్నారు. ఎకరాకు 20వేలు నష్టపోతున్నామని బాబు దగ్గరకు వెళితే ఏమన్నా డో తెలుసా... నాకు సంబంధించిన విషయం కాదని సిగ్గులేకుండా చెప్పాడు. గతంలో రైతులు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు దివంగత నేత వైఎస్ స్టేట్ ట్రేడిం గ్ కార్పోరేషన్ కు రూ.500 కోట్లు కేటాయించి పొగాకు కొనుగోళ్లు చేయించారు. ఇప్పుడూ స్టేట్‌ట్రేడింగ్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి. వైఎస్ కొనుగోలు చేసినట్టుగా గిట్టుబాటు ధర వచ్చే లా కొనుగోలు చేయాలి. జగన్ వస్తున్నాడని కేజీ ధర రూ.10 పెరిగిందని రైతు లు చెబుతున్నారు. దీంతో సంతోషపడేది లేదు. ఖచ్చితంగా రూ.150 చేయాలని డిమాండ్ చేస్తున్నా. లేదంటే 10 నుంచి పొగాకు పండించే జిల్లాల్లో ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్
Jul 5 2015 6:40 AM | Updated on Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement