ఏసీబీ అధికారులు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైల్లోనే విచారిస్తున్నట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్లో ఉన్నారు. కోర్టు ఆదేశాలతో ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులను నాలుగురోజుల పాటు కస్టడీకి తీసుకుంది.