నగరంలోని ఎల్‌బి నగర్‌లో ఎనిదేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బబ్లూ అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి కిడ్నాప్ చేశారు. ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిని కొందరు దుండగులు ఎత్తుకుపోయారు. కారులో వచ్చిన దుండగులు బాలుడ్ని కిడ్నాప్ చేశారు. బాలుడిని వదిలి పెట్టాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాలుడిని చంపేస్తామని బెదిరింపులకు దిగారు. ఈ ఘటనకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.