పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్)తో ఇప్పుడు ఎవరినోట విన్నా డిజిటల్ చెల్లింపులు.. క్యాష్‌లెస్ ఆర్థిక వ్యవస్థ అనే పదాలే వినబడుతున్నాయి. దీంతో మొబైల్ వ్యాలెట్ కంపెనీలు అనూహ్యంగా విశేష ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే, లావాదేవీల విషయంలో మాత్రం వినియోగదార్లు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రధానంగా పేటీఎం యూజర్ల నుంచి క్రమక్రమంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమ బ్యాంక్ అకౌంట్ల నుంచి సొమ్ము వెళ్లిపోతోందని.. పేటీఎం ఈ–వ్యాలెట్‌లో మాత్రం ఇది జమ కావడం లేదనేది అత్యధికంగా వస్తున్న ఫిర్యాదు.