రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్ల రద్దుతో సామాన్య ప్రజానీకం అష్టకష్టాలు పడుతుంటే.. మొబైల్ వాలెట్ సంస్థలు మాత్రం పండుగ చేసుకుంటున్నారుు. ఇప్పటికే చాలా కంపెనీలు వాటి లావాదేవీల్లో గణనీయమైన వృద్ధి నమోదరుు్యందని ప్రకటించేశారుు కూడా. అలాగే పనిలోపనిగా కస్టమర్లను మరింత ఆకర్షించడానికి వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారుు. మరొకవైపు మొబైల్ వాలెట్ల లావాదేవాల్లో బలమైన వృద్ధి నమోదవుతుందని అసోచామ్ పేర్కొంటోంది.