
బైక్ అదుపు తప్పి వ్యక్తికి గాయాలు
మదనపల్లె రూరల్ : బైక్ అదుపు తప్పి వ్యక్తి గాయపడిన సంఘటన ఆదివారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. మాలేపాడు పంచాయతీ దొనబైలుకు చెందిన ఆనంద (45) వ్యక్తిగత పనులపై ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలోని సందిరెడ్డిపల్లె వద్ద కుక్క అడ్డురావడంతో బైక్ అదపుతప్పి కిందపడ్డాడు. ప్రమాదంలో గాయపడిన ఆనంద స్థానికుల సహాయంతో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
చెవి కొరికేశాడు
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని అనంతరాజుపేట పంచాయతీ గుండాలేరు వద్ద ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అహ్మద్ అనే వ్యక్తి మల్లు శ్రీసాయి అనే వ్యక్తి చెవి కొరికేశాడు. అతని చెవి కొంత భాగం తొలగి పోయింది. శనివారం రాత్రి పీర్ల పండుగను పురస్కరించుకొని అందరూ ఒక చోట చేరడంతో పాత కక్షలు మనసులో పెట్టుకొని వాదులాటకు దిగినట్లు తెలిసింది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.