
జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లాకు 1వ ర్యాంకు
కడప అర్బన్ : జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 23, 284 కేసులకు పరిష్కారం చూపి, కక్షిదారులకు రూ.34,53,61,148 చెల్లించామని, తద్వారా రాష్ట్ర స్థాయిలో వైఎస్‌ఆర్ ఉమ్మడి కడప జిల్లా మొదటి ర్యాంకును సాధించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ చైర్మన్ డాక్టర్.సి.యామిని తెలిపారు. పరిష్కారమైన కేసుల్లో క్రిమినల్ 22, 700 కేసులు, 213 సివిల్ కేసులు, 371 ఫ్రీ లిటిగేషన్ కేసులు ఉన్నాయన్నారు.
కడపలో 4482 కేసులు, ప్రొద్దుటూరులో 2556 కేసులు, రాజంపేటలో 223 కేసులు, రాయచోటిలో 906 కేసులు, బద్వేల్‌లో 3652 కేసులు, మైదుకూరు కోర్టులో 1329 కేసులు, జమ్మలమడుగులో 3696 కేసులు, సిద్ధవటంలో 461 కేసులు, రైల్వేకోడూరులో 482 కేసులు, పులివెందులలో 1656 కేసులు, నందలూరులో 909 కేసులు, లక్కిరెడ్డిపల్లిలో 2100 కేసులు, కమలాపురంలో 832 కేసులు జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించారని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
డాక్టర్ సి.యామిని వెల్లడి