
వైభవంగా తాళ్లపాక బ్రహ్మోత్సవాలు
రాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాకలో శివ,కేశవుల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున అన్నమాచార్యుడు ఆరాధించి, పూజించిన శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయాల్లో ఘనంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ గౌరీశంకర్, తాళ్లపాక ఆలయాల ఇన్‌స్పెక్టర్ బాలాజీ, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.
శివ, కేశవుల వాహనసేవలివే : బ్రహ్మోత్సవాల తొలిరోజున శ్రీ సిద్దేశ్వరస్వామి హంసవాహనంపై, శ్రీ చెన్నకేశవస్వామి శేషవాహనంపై విహరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈఓ ప్రశాంతి పర్యవేక్షణలో తాళ్లపాక, నందలూరులో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.
భరత నాట్యంలో కలికిరి వాసికి బంగారు పతకం
కలికిరి : తమిళనాడు రాష్ట్రం సేలంలో ఎస్‌ఏఎస్ ఈవెంట్స్, కై లాస మానస సరోవర స్కూల్ ఆధ్వర్యంలో నటరాజ నర్తనం ప్రపంచ భరతనాట్య పోటీలు శనివారం నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ దేశాలతో పాటు, జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాల నుంచి 3వేల మంది ప్రదర్శకులు హాజరై 30 నిమిషాల పాటు ఒకే సారి ఏకధాటిగా నృత్య ప్రదర్శన చేసి, నటరాజ స్వామికి నాట్య నీరాజనాన్ని సమర్పించారు. దీంతో ఈవెంట్ ప్రపంచ రికార్డులకెక్కింది. కార్యక్రమానికి జిల్లా నుంచి కలికిరి పట్టణానికి చెందిన షేక్ రియాజుల్లా(పండు) హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన తమిళ నటి ప్రియదర్శిని ఈయనకు బంగారు పతకాన్ని అందజేసి అభినందించారు.

వైభవంగా తాళ్లపాక బ్రహ్మోత్సవాలు