
ఆర్కిటెక్చర్ యూనివర్సిటీపై కక్షసాధింపు తగదు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి 110 ఎకరాల భూమిని కేటాయించి రిజిస్టర్ చేసింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి యూనివర్సిటీ అభివృద్ధికి రూ.350కోట్లు మంజూరు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రూ.250కోట్లు మంజూరు చేయాలని పలుమార్లు కేంద్రానికి విన్నవించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం నియమించిన 47 డైలీ వేజ్ కార్మికులను, 135 మంది సిబ్బందిని తొలగించింది. దీన్నిబట్టే ఆర్కిటెక్చర్ యూనివర్సిటీపై కక్షసాధిస్తున్నట్లు అర్థమవుతోంది. – దేవిరెడ్డి ఆదిత్య,
జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం