
నేటి నుంచి టోల్ ఫీజు
ముద్దనూరు : నూతనంగా నిర్మాణం పూర్తయిన ముద్దనూరు–తాడిపత్రి 4లేన్ల జాతీయ రహదారిలో బుధవారం నుంచి టోల్‌ప్లాజా ప్రారంభించి టోల్ ఫీజు వసూలు చేయనున్నారు. మండలంలోని మంగపట్నం గ్రామ సమీపంలో ఈ టోల్‌ప్లాజా నెలకొల్పారు. ముద్దనూరు నుంచి తాడిపత్రి వరకు సుమారు 55 కి.మీ. రహదారిని 4లేన్ల రహదారిగా నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ రహదారి పనులకు కేంద్రప్రభుత్వం నుంచి అనుమతులు,నిధులు మంజూరయ్యాయి. అనంతరం పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇటీవలే రహదారి నిర్మాణం పూర్తవడంతో నేటినుంచి వాహనాలకు టోల్‌ఫీజు కూడా వసూలు చేయనున్నారు. తాడిపత్రి,అనంతపురం,గుత్తి,బళ్లారి తదితర ముఖ్య ప్రాంతాలకు ప్రయాణించే వాహనాలతో ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది.
జలాశయాల్లో
చేపల వేట నిషేధం
కొండాపురం : జిల్లాలోని గండికోట జలాశయం, బ్రహ్మసాగర్, సోమశిల వెనుక జలాలలో చేపల వేట నిషేధించినట్లు ఉప మత్య్ససంచాలకులు నాగయ్య మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజంగా చేపల సంతానోత్పత్తి జూలై 1 నుంచి ఆగస్టు31 వ తేది వరకు ఉంటుందని.. ఈ 62 రోజులపాటు మత్య్సకారులు ఎవరు చేపలు పట్టకూడదని ఆయన హెచ్చరించారు. చేపల వేటకు పోతే ప్రభుత్వ నియమ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జలాశయాలల్లో వేటకు వెళ్లితే మత్స్యకారుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
జిల్లాలో మత్య్స సంపద
అభివృద్ధికి కృషి
– మత్య్సశాఖ నూతన డీడీ నాగయ్య
కడప అగ్రికల్చర్ : జిల్లాలో మత్య్స సంపద అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మత్స్య శాఖ డిప్యూటి డైరెక్టర్(ఎఫ్‌ఏసీ) నాగయ్య పేర్కొన్నారు.జిల్లా మత్యశాఖ డీడీ గా నాగ య్య మంగళవారం కడప మత్స్యశాఖ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. నాగయ్యకు కార్యాలయ సిబ్బంది అభినందించారు.
5న మెగా జాబ్‌మేళా
బద్వేలు అర్బన్ : స్థానిక రాచపూడినాగభూషణం డిగ్రీ, పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 5న సియట్ కంపెనీ ద్వారా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ఏఓ సాయిక్రిష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ, బీసీఏలలో 2022, 2023, 2024, 2025 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని తెలిపారు. వివరాలకు 8297160304, 9703244614 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
నియామకం
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లా విద్యార్థి విభాగ కమిటీని నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఉపాధ్యక్షుడిగా సి. సాయి నారాయణరెడ్డి(బద్వేల్), బి. శ్రీకాంత్‌రెడ్డి(జమ్మలమడుగు), జిల్లా ప్రధాన కార్యదర్శులుగా కేసీ పాములేటి(జమ్మలమడుగు, ఆర్. మహేష్(కమలాపురం), శ్యామ్ మంచాల (కడప), నరేంద్రారెడ్డి (ప్రొద్దుటూరు), రాయు డు (మైదుకూరు), జిల్లా కార్యదర్శులుగా టి.మధుసూదన్‌రెడ్డి(మైదుకూరు), చైతన్య (ప్రొద్దుటూరు), పవన్‌కుమార్‌రెడ్డి(పులివెందుల), అబ్దుల్ ఖాదర్ (జమ్మలమడుగు), ఎన్. జయరామిరెడ్డి(కమలాపురం),రాకేష్ (బద్వేల్), మహ్మద్ సొహైల్ (కడప)ను నియమించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పి. ధీరజ్ గణేష్, ఎస్. లెన్నీ, వి. కార్తిక్ (కడప), విజయ్‌భాస్కర్‌రెడ్డి, కె. శ్రీనివాసులురెడ్డి(కమలాపురం), కె. శివప్రసన్న కుమార్, జి. నారారయణరెడ్డి, కె. రవీంద్రారెడ్డి(బద్వేల్), వి. ఆదిత్యనాథ్‌రెడ్డి, ఎస్. అఖిల్(ప్రొద్దుటూరు), షేక్ మహ్మద్, ప్రకాష్ వేముల(పులివెందుల), భరత్‌కుమార్‌రెడ్డి, షేక్ ఖలీల్‌బాషా (జమ్మలమడుగు), నరసింహారెడ్డి, వై. చైతన్యరెడ్డి(మైదుకూరు)లను నియమించారు.

నేటి నుంచి టోల్ ఫీజు

నేటి నుంచి టోల్ ఫీజు