రాష్ట్రంలో విధ్వంసకర పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో విధ్వంసకర పాలన

Jul 2 2025 5:35 AM | Updated on Jul 2 2025 5:35 AM

రాష్ట

రాష్ట్రంలో విధ్వంసకర పాలన

బద్వేలు అర్బన్‌ : కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని, అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఇంటిని ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేశారని కడప ఎంపీ వైఎస్‌అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని చింతలచెరువు పంచాయతీ బయనపల్లె గ్రామంలో ఇటీవల కూటమి నేతల ఒత్తిడితో ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు కూల్చివేసిన శ్రీకాంత్‌రెడ్డి ఇంటిని మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్‌ సుధతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా శ్రీకాంత్‌రెడ్డి ఇంటిని కూల్చివేశారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తుందనేదానికి ఈ సంఘటనే నిదర్శనమని అన్నారు. అన్యాయంగా ఇంటిని కూల్చి వేసి తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. గుడికి, బడికి 50 మీటర్ల దూరంలోనే మద్యంషాపు ఉండడం అసాంఘికమని..అటువంటి వాటిపై దృష్టి సారించాలని సూచించారు. సుమారు 8 ఏళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటిని నిర్మించుకుంటే అప్పుడు చెరువు స్థలమని కనిపించలేదా అని ప్రశ్నించారు. అలాగే కూల్చివేసిన ఇంటి పక్కనే అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో సీసీ రోడ్డు కూడా ఏర్పాటు చేశారని.. అప్పుడు చెరువు స్థలమని ఈ ప్రభుత్వానికి తెలియదా అని అన్నారు. శ్రీకాంత్‌రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసానిఆదిత్యరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి, మాజీ కుడా చైర్మన్‌ గురుమోహన్‌, జెడ్పీటీసీ పోలిరెడ్డి, వైఎస్సార్‌సీపీ మున్సిపాలిటీ, ఆయా మండలాల అధ్యక్షులు సుందర్‌రామిరెడ్డి, మల్లేశ్వర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ గోపాలస్వామి, డీఎల్‌డీఏ చైర్మన్‌ మాధవరెడ్డి, సగర విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బంగారుశీనయ్య, యద్దారెడ్డి పాల్గొన్నారు.

రైతు కుటుంబానికి ఎంపీ పరామర్శ

ఖాజీపేట : కూటమి పాలనలో రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. బి. కొత్తపల్లె పంచాయతీ బక్కాయపల్లె గ్రామానికి చెందిన యువ రైతు పత్తి రామచంద్రారెడ్డి (42) మార్చి 19 న తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య హత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మంగళవారం రోజున బక్కాయపల్లె గ్రామానికి వచ్చి రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సరైన దిగుబడి రాక పోవడం, దిగుబడి వచ్చిన సందర్భంలో గిట్టు బాటు ధర లేక నష్టాలు రావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పత్తి రామచంద్రారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పిల్లలను బాగా చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మాజీ సలహాదారుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, జిల్లా వైఎస్సార్‌ సీపీ జనరల్‌ సెక్రటరీ పీవీ రాఘవరెడ్డి, ఎపీఎస్‌ ఆర్టీసీ కడప మాజీ జోన్‌ అధ్యక్షుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మండల కన్వీనర్‌ మురళీమోహన్‌రెడ్డి, కేసీకెనాల్‌ ప్రాజెక్టు కమిటీ మాజీ అధ్యక్షుడు డీఎల్‌ శ్రీనివాసులరెడ్డి, కేసీకెనాల్‌ ప్రాజెక్టు కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, మైదుకూరు నియోజకవర్గ రైతు విబాగం అధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కడప ఎంపీ వైఎస్‌అవినాష్‌రెడ్డి

రాష్ట్రంలో విధ్వంసకర పాలన 1
1/1

రాష్ట్రంలో విధ్వంసకర పాలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement