తొలి అడుగులో టీడీపీ నేతల నిలదీత | - | Sakshi
Sakshi News home page

తొలి అడుగులో టీడీపీ నేతల నిలదీత

Jul 5 2025 6:28 AM | Updated on Jul 5 2025 6:28 AM

తొలి

తొలి అడుగులో టీడీపీ నేతల నిలదీత

ప్రొద్దుటూరు: మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ ఆచార్ల కాలనీలో శుక్రవారం టీడీపీ నేతలు ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు టీడీపీ నేతలను నిలదీశారు. చాలా రోజులుగా సిమెంటు రోడ్డుపై వర్షపు నీళ్లు నిలుస్తున్నాయని, డ్రైనేజీ కాలువలు సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలిపారు. పలుమార్లు ఈ సమస్యను పరిష్కరించాలని కోరినా స్పందించలేదని టీడీపీ నేతలపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. స్థానికులు నిలదీయడంతో దిక్కుతోచని నేతలు.. త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

రోడ్డుపై నిలిచిన మురికి నీరు

డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని

కోరిన ప్రజలు

తొలి అడుగులో టీడీపీ నేతల నిలదీత 1
1/1

తొలి అడుగులో టీడీపీ నేతల నిలదీత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement