
రాజకీయ పార్టీల గురించి, చరిత్ర, విశ్వసనీయత, పరిపాలన గురించి విద్యార్థులు నిశితంగా పరిశీలించాలి. ప్రతి విద్యార్థి ఓపెన్ మైండ్‌తో ఆలోచిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు, అందిస్తున్న పథకాల గురించి అర్థమవుతుంది. రాష్ట్రంలో ప్రతి పథకం సక్రమంగా ప్రజలకు చేరుతున్నాయంటే పరిపాలన ఎంత పకడ్భందీగా, పారదర్శకంగా ఉందో అర్థం చేసుకోవాలి.
– జయసింహ, ఇన్‌చార్జి స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, కడప కేంద్రం
వైఎస్‌ఆర్ కలను.. జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేశారు
రాష్ట్రంలో పాఠశాలవిద్యలో ఇంగ్లీషు మీడియం పాఠశాలలు నెలకొల్పాలన్న వైఎస్‌ఆర్ కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేశారు. పేదవాళ్లు తమ పిల్లలను ఇంగ్లీషు మీడియంలో చదివించడం, వారికి సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి అభినందనలు. అప్పుల గురించి చాలామంది మాట్లాడుతున్నారు. పరిపాలనలో అది అత్యంత సహజమైన విషయం – పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
మహిళా సాధికారతకు పెద్దపీట
విద్య, వైద్యం, సంక్షేమ రంగాలతో పాటు మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళల రక్షణ కోసం దిశ యాప్, అన్నింటా మహిళలకు రిజర్వేషన్లు, నామినేటెడ్ పోస్టుల్లో సైతం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరం. గతంతో పోల్చితే నేడు అన్ని రంగాల్లో ప్రగతి సాధించాం. విద్యారంగంలో ఎవరూ తీసుకురానన్ని మార్పులు తేవడంను యువత ఆహ్వానిస్తోంది. – కవిత,
సాయిపరమేశ్వర డిగ్రీ కళాశాల, జమ్మలమడుగు
అన్ని సౌకర్యాలు పొందుతున్నాం..
ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను అందిపుచ్చుకుని విద్యాభ్యాసం చేస్తున్నాం. మేము పాఠశాలలో చదివే సమయంలో ఇప్పుడున్నన్ని సౌకర్యాలు లేవు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువచ్చింది. విద్యతోనే ప్రగతి సాధ్యమని నమ్మే పాలకులు ఉండటం మనందరి అదృష్టం. ప్రభుత్వంపై చేసే ఫేక్ ప్రచారాలకు యువత దూరంగా ఉండాలి.
– సుదీప్తి, బీటెక్, అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల, కడప


