రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పోలవరం రూరల్/యలమంచిలి: తూర్పుగోదావరి జిల్లాలోని గండిపోచమ్మ తల్లిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా.. పోలవరం అంగుళూరు సమీపంలో కొండ వద్ద బొలేరో వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలు, ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే సమీపంలోని పవర్ ప్రాజెక్టు నిర్మాణం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ అంబులెన్స్‌లో వీరిని పోలవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరంతా యలమంచిలి మండలంలోని దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం గ్రామాలకు చెందిన వారు. వీరిలో అబ్బిరాజుపాలెం పంచాయతీ బండివానిగట్టు ప్రాంతానికి చెందిన కాసురేకుల నరసింహమూర్తి (37) ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. మిగిలిన వారిని పోలవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన వారిలో జి.శ్రీనివాస్, ఎం.సురేష్‌ను అంబులెన్స్‌లో రాజమండ్రి తరలించగారు. ఎం.సురేష్, జి.వరప్రసాద్, జి.రాజులు పోలవరం వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. స్వల్పంగా గాయపడిన ఏడుగురికి చికిత్స అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలవరం వైద్యశాలకు తరలించారు. పోలవరం సీఐ బాల సురేష్ బాబు క్షతగాత్రులను పరామర్శించి ఘటన వివరాలను తెలుసుకున్నారు.
ఐదుగురికి గాయాలు


