మందకొడిగా ఆస్తి పన్ను వసూళ్లు
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లాలో ఆయా మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, ఏలూరు కార్పొరేషన్, చింతలపూడి నగర పంచాయతీలుగా ఉన్నాయి. వీటిలో మొత్తంగా 1,14,684 అసెస్‌మెంట్లు ఉండగా, వీటిపై రూ.93.92 కోట్లు ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉండగా, పాత బకాయిలు కూడా ఉన్నాయి. ఇంతవరకు 8 నెలల కాలంలో రూ.28.20 కోట్లు మాత్రమే వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా నాలుగు నెలలు మాత్రమే ఉంది. మొత్తం మీద 30.03 శాతం మాత్రమే వసూలైంది. ఆయా మున్సిపాలిటీల్లో ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పన్నులు అన్నీ ఉన్నాయి. అన్నీ కలిపి మొత్తం 1,14,684 అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఇంతవరకు పన్నుల వసూళ్ళలో జంగారెడ్డిగూడెం పట్టణం 35.32 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా, ఏలూరు కార్పొరేషన్ 28.68 శాతంతో చివరి స్థానంలో ఉంది. రెండు , మూడు స్థానాల్లో నూజివీడు, చింతలపూడి ఉన్నాయి.
పన్ను వసూళ్ల కోసం త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. సచివాలయాల వారీగా అన్ని సెక్రటరీ, ఎమినిటీస్ సెక్రటరీ మహిళా పోలీసులకు కలిపి ఒక టీమ్ ఏర్పాటు చేశాం. బకాయిదారులకు నోటీసు, మొండి బకాయిదాలకు రెడ్ నోటీసులు ఇస్తున్నాం. జనవరి వరకు 60 శాతం, ఫిబ్రవరి మార్చిలో 100 శాతం వసూలు చేసేలా ప్రణాళిక రచించాం. టాక్స్ వసూళ్లలో ఎలాంటి అలసత్వం వహించవద్దని ఆదేశాలు జారీ చేశాం. సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి.
– కేవీ రమణ, మున్సిపల్ కమిషనర్, జంగారెడ్డిగూడెం
మున్సిపాలిటీలు వసూలవ్వాల్సిన వసూలైన శాతం
పన్ను (రూ. కోట్లలో) పన్ను (రూ. కోట్లలో)
ఏలూరు (కార్పొరేషన్) 67.98 12.50 28.68
జంగారెడ్డిగూడెం 12.62 4.46 35.32
నూజివీడు 10.64 3.42 32.15
చింతలపూడి 2.68 0.82 30.74
మందకొడిగా ఆస్తి పన్ను వసూళ్లు


