ప్రజా పంపిణీ పరేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజా పంపిణీ పరేషన్‌

Nov 30 2025 8:14 AM | Updated on Nov 30 2025 8:14 AM

ప్రజా

ప్రజా పంపిణీ పరేషన్‌

సరుకులకు కోత

సరుకులకు కోత

సాక్షి, భీమవరం: ప్రజాపంపిణీ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. మండల లెవిల్‌ స్టాక్‌ (ఎంఎల్‌ఎస్‌) పాయింట్లలో రెండు నెలలకు సరిపడా స్టాకు ఉండాలనే నిబంధన గాలికొదిలేసింది. గతంలో పది రోజుల ముందే రేషన్‌డిపోలకు స్టాకు మొత్తం ఒకేసారి చేరేది. రెండు నెలల నుంచి మూడు నాలుగు పర్యాయాలుగా సరుకులు సర్దుబాటు చేస్తోంది.

1,052 షాపులు.. 5.67 లక్షల కార్డులు

జిల్లాలోని 1,052 రేషన్‌ డిపోల పరిధిలో 5,67,700 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటిలో దాదాపు 31,844 మంది అంత్యోదయ కార్డుదారులు ఉన్నారు. వీరికి 35 కిలోల బియ్యం, కిలో పంచదార, తెల్ల రేషన్‌ కార్డుదారులకు కుటుంబంలోని ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం, అరకిలో పంచదార చొ ప్పున నెలకు సుమారు 8,790 టన్నుల బియ్యం, 300 టన్నుల చక్కెర అవసరం అవుతాయి. ప్రతినెలా 16వ తేదీ నుంచి 26వ తేదీలోపు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి రేషన్‌ షాపులకు సరుకులు చేరవేయాలి. 26వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులకు ఇంటింటికీ, 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సాధారణ కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంది.

నిల్వలకు కొరత : ఉండి, తణుకు, తాడేపల్లిగూ డెం, పెనుమంట్ర, పాలకొల్లు, నరసాపురంలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా సరుకులు చేరవేస్తుంటారు. సాధారణంగా రెండు నెలలకు సరిపడా సరుకులు ఎప్పుడూ గోదాముల్లో నిల్వ ఉంచాలి. నెలనెలా సరుకులు సరఫరాకు తగ్గట్టు లోటును భర్తీ చేసుకుంటుండాలి. మునుపెన్నడూ లేనివిధంగా రెండు నెలల నుంచి ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొనడంతో రేషన్‌ షాపులకు సరుకుల రవాణా ఆలస్యమవుతోంది. ఉదాహరణకు ఉండిలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి రేషన్‌ షాపులకు 2,300 టన్నుల బియ్యం, 70 టన్నులు పంచదార సరఫరా జరుగుతుంది. ఇక్కడి గోదాము ఖాళీ అవ్వడంతో ప్రస్తుతం భీమవరంలోని బఫర్‌ గొడౌన్‌ నుంచి సరుకులు సరఫరా చేస్తున్నారు. తణుకు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో రెండు గొడౌన్లకు ప్రస్తుతం ఒక్కటి మాత్రమే వినియోగంలో ఉంది. దీంతో పూర్తిస్థాయిలో స్టాకు పెట్టే పరిస్థితి ఉండటం లేదు. గోదా ము కెపాసిటీ 1,200 టన్నులకు ఈనెల కోటా సరఫరా చేయగా ప్రస్తుతం 250 టన్నులు ఉన్నట్టు సి బ్బంది చెబుతున్నారు. మిగిలిన చోట్ల ఎంత మేర స్టాకులు ఉంటున్నాయనేది ప్రశ్నార్థకమే.

ఆలస్యమవుతున్న సరుకులు : బియ్యం, పంచదార, ఐసీడీఎస్‌, మధ్యాహ్న భోజనానికి సంబంధించి అలాట్‌మెంట్‌ మేరకు ఒకేసారి సరుకులు మొత్తాన్ని రేషన్‌ షాపులకు చేరవేస్తుంటారు. రెండు నెలల నుంచి మూడు నాలుగు పర్యాయాల్లో సరుకులు అందజేస్తున్నట్టు డీలర్లు అంటున్నారు. గత నెలలో 260 షాపులకు సరుకులు ఆలస్యంగా చేర గా, ఈనెల కూడా కొన్నింటికి సరుకులు ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. సరుకులు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు డీలర్లు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు వెళ్లి థంబ్‌ వేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఈపోస్‌ మెషీన్‌లో స్టాక్‌ క్లోజింగ్‌ బ్యాలెన్స్‌ చూపించక సరుకులు, థంబ్‌ కోసం నెలలో నాలుగైదు సార్లు తిరిగేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోందంటున్నారు.

65 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగుల కార్డులు జిల్లాలో 71,640 వరకు ఉన్నాయి. వీరికి ప్రతినెలా 26వ తేదీ నుంచి నెలాఖరవు లోపు రేషన్‌ సరులకు డోర్‌ డెలివరీ చేయాలి. బియ్యం, పంచదార పూర్తిస్థాయిలో రాక సరుకుల పంపిణీ ఇబ్బంది అవుతోంది. వచ్చిన మేరకు బియ్యం అందజేస్తుండగా పంచదార కోసం మరలా షాపులకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈనెల రేషన్‌లో సాధారణ కార్డుదారులకు సైతం కొన్నిచోట్ల పంచదారకు కోత పెట్టిన పరిస్థితి కనిపించింది. డిసెంబరు నెలకు గాను ఇంకా కొన్ని షాపులకు పంచదార పూర్తిస్థాయిలో అందలేదని సమాచారం. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజాపంపిణీ వ్యవస్థ అథోగతి పాలవుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాదిరి పూర్తిస్థాయిలో సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

కోతల సర్కారు

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు అరకొరగా నిల్వలు

నిత్యం రెండు నెలలకు సరిపడా స్టాకు ఉంచాలన్న నిబంధన గాలికి

రేషన్‌ షాపులకు ఆలస్యంగా చేరుతున్న సరుకులు

సక్రమంగా జరగని సరుకుల డెలివరీ

వృద్ధులకు డోర్‌ డెలివరీకి ఆటంకాలు

ప్రజా పంపిణీ పరేషన్‌ 1
1/1

ప్రజా పంపిణీ పరేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement